Share News

ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలి

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:01 AM

పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో, ఎన్నికల అధికారి డీడీ స్వరూపరాణి ఎన్నికల సిబ్బందికి సూచించారు.

ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలి
భోగాపురం: మాట్లాడుతున్న ఎంపీడీవో స్వరూపరాణి:

భోగాపురం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో, ఎన్నికల అధికారి డీడీ స్వరూపరాణి ఎన్నికల సిబ్బందికి సూచించారు. శనివారం స్థానిక మండలపరిషత్‌ సమావేశ భవనం, వెలుగు కార్యాలయం, ఐసీడీఎస్‌ కార్యాలయాల్లో నిర్వహించిన స్టేజ్‌-2 పీవో, ఆర్వో, ఏఆర్వోల శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల నియమావళి, నిర్వహణ, తదితర అంశాలపై వివరించారు. అనంతరం ఎంవోటీలు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో గాయత్రి, ఎంఈవో రమణమూర్తి, ఇ.రాములప్పడు, 200 మంది పీవోలు, 45 మంది ఆర్వో, ఏఆర్వోలు పాల్గొన్నారు.

ఫవంగర, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): వంగర జడ్పీ ఉన్నత పాఠశాలలో 110 మంది ప్రిసైడింగ్‌ అధికారులకు మొదటి విడత ఎన్నికల శిక్షణ శనివారం నిర్వహిం చారు. ఐదుగురు మాస్టర్‌ ట్రైనీస్‌ ఆధ్వర్యంలో అధికారులకు ఎన్నికల నిర్వహణ విధి విధానాలు, పోలింగ్‌ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గణేష్‌నాయుడు, డిప్యూటీ ఎంపీడీవో రామారావు, అధికారులు పాల్గొన్నారు.

ఫ డెంకాడ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం పోలింగ్‌ అధికారులకు ఎంపీడీవో దేవానంద్‌ అధ్యక్షతన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్‌ ట్రైనర్లుగా టి.శ్రీనివాసరావు, కె.కిరణ్‌కుమార్‌, రాంబాబులు వ్యవహరించి.. పోలింగ్‌ విధానాలు, బ్యాలెట్‌ పేపర్ల వినియోగం, ఓటర్ల గుర్తింపు, పోలింగ్‌ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు

ఫ బొండపల్లి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలో 28 పంచాయతీ ఎన్ని కలకు సంబంధించి సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులకు వేసిన నామినేషన్లను శనివారం ఆయా సచివాలయాల్లో ఆర్వోలు పరిశీలించారు. ఈనెల 23వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవడంతోపాటు అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలియజేయడానికి అవకాశం ఉన్నట్టు ఎంపీడీవో అరసాడ రఘుపతిరావు తెలిపారు.

Updated Date - Nov 22 , 2026 | 12:01 AM