Share News

Elections have arrived in Rajam. రాజాంకు ఎన్నికలొచ్చేశాయ్‌

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:24 AM

Elections have arrived in Rajam. రాజాం మునిసిపాల్టీలో ఎన్నికల నగరా మోగింది. ఎప్పుడెప్పుడా అని పుర వాసులు ఎదురుచూస్తున్న ఎన్నికల వేళ రానే వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవకాశం కల్పిస్తూ వాటిలో రాజాంకు కూడా చోటు కల్పించింది. దీంతో గురువారం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది.

Elections have arrived in Rajam. రాజాంకు   ఎన్నికలొచ్చేశాయ్‌

రాజాంకు

ఎన్నికలొచ్చేశాయ్‌

రెండు దశాబ్దాల తరువాత తొలిసారి ఎలక్షన్‌

నోటిఫికేషన్‌ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం

మున్సిపల్‌ పీఠంపై బీసీ మహిళ

జనసేనకు కేటాయించిన కూటమి పక్షాలు

నాయకుల విగ్రహాలకు ముసుగులు

26న పోలింగ్‌... 30న ఫలితాలు

రాజాం మునిసిపాల్టీలో ఎన్నికల నగరా మోగింది. ఎప్పుడెప్పుడా అని పుర వాసులు ఎదురుచూస్తున్న ఎన్నికల వేళ రానే వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవకాశం కల్పిస్తూ వాటిలో రాజాంకు కూడా చోటు కల్పించింది. దీంతో గురువారం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. మరోవైపు రాజకీయ పార్టీల నేతలు కూడా ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. మున్సిపల్‌ పీఠం బీసీ మహిళకు రిజర్వ్‌ అయిన విషయం తెలిసిందే. కూటమి పక్షాలు చైర్‌పర్సన్‌ పదవిని జనసేనకు కేటాయించాయి. విపక్షమైన వైసీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుని బంధువు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

రాజాం రూరల్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి):

రాజాం మునిసిపాల్టీకి ఎన్నికల కళ వచ్చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో అధికారులతో పాటు రాజకీయ నాయకుల హడావిడి మొదలుకానుంది. 2005 అక్టోబరు నుంచి ఎన్నికలకు నోచుకోని రాజాం మున్సిపాలిటీలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్‌ యంత్రాంగం ఇప్పటికే సన్నాహాల్లో నిమగ్నమైంది. నువ్వా..నేనా అన్నట్లు రాజకీయ పక్షాలు కూడా పోటీకి సై అంటున్నాయి. ఈమేరకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బలాన్ని, బలగాన్ని రంగంలోకి దించాయి. అయితే రాజాం మునిసిపల్‌ చైర్‌పై గంపెడాశతో ఉన్న టీడీపీ శ్రేణులు కూటమి నిర్ణయంతో కాస్త నిరాశ చెందాయి. కూటమి నాయకత్వం పొత్తులో భాగంగా చైర్‌పర్సన్‌ సీటును జనసేనకు కేటాయించింది. మరోవైపు వైసీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరడంతో ఆ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది.

రాజాం మునిసిపాలిటీలో 21 ఏళ్లుగా అధికారుల పాలనలో విసిగివేసారిపోయిన ప్రజలు ఎన్నికలు జరుగుతాయన్న ప్రకటన విడుదలతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే మునిసిపాల్టీలోని పదవులకు దశాబ్దాలుగా ఎదురుచూసిన ఆశావహులకు పట్టుమని పదిరోజులే సమయం ఉండడంతో ఒకేసారి బిజీ అయిపోయారు. నాయకులతో మంతనాలు ప్రారంభించేశారు. కౌన్సిలర్‌ టికెట్ల కేటాయింపుపై పార్టీలూ కుస్తీ పడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం గురువారం నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ఈనెల 14 నుంచి 16 వరకూ రాజాం మునిసిపల్‌ కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు గడువు నిర్దేశించారు. 17న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 19 మధ్యాహ్నం మూడుగంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఇచ్చారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను అదేరోజు మధ్యాహ్నం ప్రకటిస్తారు. ఈనెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు. రీపోలింగ్‌ నిర్వహించాల్సి వస్తే 27న జరిపిస్తారు. 30న కౌంటింగ్‌ నిర్వహించి విజేతల పేర్లను ప్రకటిస్తారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలులోకి రావడంతో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు పడ్డాయి. అన్ని రాజకీయపార్టీలకు చెందిన బ్యానర్లను తొలగించే పనిలో మునిసిపల్‌ సిబ్బంది నిమగ్నమయ్యారు.

ప్రవర్తనా నియమావళి పాటించాలి

రామచంద్రరావు, కమిషనర్‌, రాజాం మునిసిపాలిటీ

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాజాం మునిసిపాలిటీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోడ్‌ తక్షణమే అమలులోకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు గమనించాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి వ్యవహరించాలి. మున్సిపాలిటీలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి.

మొత్తం వార్డులు : 32

చైర్‌పర్సన్‌ రిజర్వేషన్‌ : బీసీ మహిళ

వార్డుల రిజర్వేషన్‌ : ఎస్టీ 1, ఎస్సీ 4, బీసీ 11, మహిళలు 9, అన్‌ రిజర్వ్‌డ్‌ 7

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు : 49

ఓటర్లు : 36,786 పురుషులు !18, మహిళలు ! 18,253. ఇతరులు ! 2

జోనల్‌ అధికారులు : 4

రూట్‌ ఆఫీసర్లు : 9

స్ట్రాంగ్‌రూంలు : 1 (జీఎంఆర్‌ వరలక్ష్మి సెయింటాన్స్‌ పాఠశాల)

అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు: 98, వచ్చినవి 110

అవసరమైన వాహనాలు : 9

పోలింగ్‌ అధికారులు (పీఓలు) : 55 మంది (10 శాతం రిజర్వ్‌డ్‌తో కలిపి)

ఏపీఓలు : 55 మంది (10 శాతం రిజర్వ్‌డ్‌తో కలిపి)

ఓపీఓలు : 220 మంది (10 శాతం రిజర్వ్‌డ్‌తో కలిపి)

మైక్రో అబ్జర్వర్లు : 55 మంది

--------------------

Updated Date - Nov 13 , 2026 | 12:24 AM