Share News

Elections for cooperative societies at last ఎట్టకేలకు సంఘాలకు ఎన్నికలు

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:02 AM

Elections for cooperative societies at last ఎట్టకేలకు గొర్రెల, మేకల పెంపకందారుల ప్రాథమిక పరపతి సహకార సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటికి 2019లో ఎన్నికలు జరగ్గా 2024 జనవరితో పాలకవర్గ సభ్యుల పదవీ కాలం ముగిసింది. 2

Elections for cooperative societies at last ఎట్టకేలకు సంఘాలకు ఎన్నికలు
జిల్లా పశు సంవర్థకశాఖ కార్యాలయం

ఎట్టకేలకు సంఘాలకు ఎన్నికలు

గొర్రెల, మేకల పెంపకందారులకు ఊరట

ఉమ్మడి జిల్లాలో 114 సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

14న చేతులేత్తే పద్ధతిలో ప్రక్రియ

విజయనగరం రూరల్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు గొర్రెల, మేకల పెంపకందారుల ప్రాథమిక పరపతి సహకార సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటికి 2019లో ఎన్నికలు జరగ్గా 2024 జనవరితో పాలకవర్గ సభ్యుల పదవీ కాలం ముగిసింది. 2024 జనవరి నుంచి పర్సన్‌ ఇన్‌చార్జిల పాలనలోనే సంఘాలు నడుస్తున్నాయి. ఆరు నెలలు చొప్పున నాలుగు పర్యాయాలు పీఐసీలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం జూలై 15తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల నిర్వహణపై పశు సంవర్థకశాఖ ఉన్నతాధికారులతో పాటు కలెక్టరు రామసుందర్‌ రెడ్డి సైతం పశు సంవర్థకశాఖాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని స్పష్టం చేయడంతో పశు సంవర్థకశాఖాధికారులు గత వారం రోజులుగా దీనిపై చర్చించి, ఎన్నికలకు సంబంధించిన ఫైలును కలెక్టరు రామసుందర్‌ రెడ్డి, పార్వతీపురం-మన్యం జిల్లా కలెక్టర్‌ ప్రభాకర రెడ్డిలకు పంపారు. ఇద్దరు కలెక్టర్లు ఎన్నికల నిర్వహణ ఫైలుపై శనివారం సంతకాలు చేశారు. దీంతో పశు సంవర్థకశాఖాధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

14న చేతులేత్తే పద్ధతిలో ఎన్నికలు

విజయనగరం జిల్లాలో 82 సంఘాలు, పార్వతీపురం-మన్యం జిల్లాలో 32 సంఘాలు మొత్తంగా 114 సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. చేతులేత్తే పద్ధతిలోనే ఈ ఎన్నికలు జరగనున్నాయి. సహకార సంఘాల సమావేశం నిర్వహించి అధ్యక్షుడ్ని, మిగతా సభ్యులను ఎన్నుకుంటారు. ఎన్నికైన సంఘాల అధ్యక్షులు అంతా జిల్లా సంఘ చైర్మన్‌ని ఎన్నుకుంటారు. ఈ నెల 14న విజయనగరం, పార్వతీపురం-మన్యం జిల్లాలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. నిబంధనలు అనుసరించి జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించనుంది.

Updated Date - Jun 21 , 2026 | 12:02 AM