ఎన్నికల సామగ్రి సిద్ధం
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:43 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.
బొబ్బిలి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికల నిర్వహణ కు అవరమైన సంచులు, అట్టలు, తదితర నాన్ స్టేషనరీ సామగ్రిని సమకూరుస్తున్నారు. బుధవారం వాటిని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో భద్రపరిచారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలు, ఓటర్ల కులాల కేటగిరీల మార్కింగ్ తదితర ప్రక్రియ అధికారికంగా పూర్తయిన సంగతి తెలిసిందే. పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటికి కావల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. వార్డుల వారీ రిజర్వేషన్లు, చైర్మన్ పదవి ఏ కేటగిరీకి రిజర్వు అవుతుందో నన్న ఉత్కంఠ సర్వత్రానెలకొంది. వీటిపై ఆరా తీసేందుకు రోజూ మున్సిపల్ కార్యాలయానికి ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు.