Share News

మొదలైన ఎన్నికల వేడి

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:21 AM

ప ల్లెల్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు దీటుగా పంచాయతీ పోరుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటు న్నారు.

  మొదలైన ఎన్నికల వేడి

- పోటీకి సన్నాహాలు చేసుకుంటున్న అభ్యర్థులు

- రూ.10 లక్షలకు పైగా వెచ్చించేందుకు సిద్ధం

- ఏకగ్రీవాల కోసం మంతనాలు

- ఓటర్లకు తాయిలాలు

గరుగుబిల్లి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప ల్లెల్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు దీటుగా పంచాయతీ పోరుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటు న్నారు. ప్రధానంగా గతంతో పోల్చితే ఈదపా ఒక పంచాయతీకి ఎన్నికలు నిర్వహణకు రూ.10 లక్షలకు పైగా వెచ్చించేందుకు సిద్ధమ వుతున్నారు. నోటిఫికేషన్‌ రాక ముందే సర్పంచ్‌ అభ్యర్థులు తమ పంచాయతీల్లో ఓటర్లకు ముందస్తుగా తాయిలాలు అందిస్తున్న పరి స్థితి నెలకొంది. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించడంపై దృష్టి సారిస్తున్నారు. వారికి ఫోన్‌పే వంటి యాప్‌ల ద్వారా డబ్బులు పంపించ డంతో పాటు వారు వచ్చేందుకు వీలుగా రైళ్లు, బస్సుల టికెట్లను బుక్‌ చేస్తున్నా రు. కొన్నిచోట్లకు వాహనాలను సైతం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొంత మంది గ్రామాల్లోని ఆలయాలకు రంగులు వేయిం చడం, ఆలయాల నిర్మాణాలకు ముందుకు రావడం వంటివి చేస్తున్నారు. ఓటర్లు ఏ ప్రలోభాలకు లొంగుతారో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు దిశగా చర్చలు ప్రారంభమయ్యాయి. పంచాయతీ ఏకగ్రీవానికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పోటీలో ఉంటే ఆ మొత్తమే ఖర్చు అవుతుందని, అదే ఏకగ్రీవం అయితే గ్రామాభివృద్ధికి దోహదపడుతుందన్న అంచనాల్లో అధికంగా ఉన్నారు. గ్రామాల్లో కుటుంబాల వారీగా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. మద్దతు అందిస్తే అభివృద్ధికి చొరవ చూపడం జరుగుతుందని హామీ ఇస్తున్నారు. మరోవైపు ఒక పర్యాయం నేను, మరో పర్యాయం మీరు అన్న సంకేతాలు అందిస్తున్నారు. పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులు ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకుంటున్నా ఓటర్లు మాత్రం హామీ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. యువ ఓటర్లు నాయకుల తీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. అభివృద్ధి చేసే వారికి తమ మద్దతు ఉంటుందని తేల్చి చెబుతున్నారు. ప్రజల తీర్పు ఎలా ఇస్తారో వేచి చూడాలి మరి.

Updated Date - Nov 13 , 2026 | 12:21 AM