Election Fever ఎన్నికల కోలాహలం
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:53 AM
Election Fever పుర పోరులో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం సాఫీగా జరిగింది. అయితే పురపాలక సంఘాల్లో కూటమి పార్టీల మధ్య ఐక్యత ప్రశ్నార్థకంగా మారింది. అధిష్ఠానాల మాట వింటున్నట్టు పైకి కనిపించినా.. లోలోన నేతల మధ్య అసంతృప్తి చెలరేగుతోంది.
చాలాచోట్ల పొత్తు ధర్మం పాటించని వైనం
పుర పోరులో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం సాఫీగా జరిగింది. అయితే పురపాలక సంఘాల్లో కూటమి పార్టీల మధ్య ఐక్యత ప్రశ్నార్థకంగా మారింది. అధిష్ఠానాల మాట వింటున్నట్టు పైకి కనిపించినా.. లోలోన నేతల మధ్య అసంతృప్తి చెలరేగుతోంది. మొత్తంగా పోలింగ్ జరిగే వరకు ఎవరు ఎంతవరకు పొత్తు ధర్మం పాటిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.
పార్వతీపురం/ పార్వతీపురం టౌన్/ సాలూరు/ పాలకొండ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మున్సి పాల్టీలో 36వ వార్డులకు సంబంధించి 186 మంది నామినేషన్‌లను దాఖలు చేశారు. బుధవారం నాటికి వీరిలో 64 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ 32, వైసీపీ 36, జనసేన 12, బీజేపీ 1, సీపీఐ 1, సీపీఐ(ఎం) 4, ఐఎన్‌సీ 2, ఇండిపెండెంట్‌లు 34 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ప్రస్తుతానికి పోటీలో ఉన్నారు. పది వార్డుల్లో టీడీపీ, జనసేన పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. స్నేహ పూర్వక పోటీ అంటూ 2, 7, 8, 20, 25, 28, 31, 32, 34 తదితర వార్డుల్లో వారు బరిలో నిలవడం చర్చనీయాంశ మవుతోంది. పార్వతీపురం మున్సి పాల్టీలో టీడీపీ తరపున కౌన్సిలర్‌గా పోటీ చేయాలని పి.సాయి భావించారు. అయితే టికెట్ కేటాయించక పోవడంతో తన భార్య లలితను ఎన్నికల బరి లోకి దింపారు. స్వతంత్య్ర అభ్యర్థిగా చైర్‌పర్సన్ సీటుకు నామినేషన్ వేయిం చారు. చైర్‌పర్సన్ రేసులో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు సతీమణి డి.జ్యోతి, కోడలు డి.దీప్తి తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వాస్తవంగా పార్వతీపురం మున్సిపాలిటీని టీడీపీకి కేటాయించారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ.. బీజేపీ తరఫున చైర్‌పర్సన్ సీటు కోసం నామినే షన్లు వేసిన వారు ఉపసంహరించుకున్నారు. పార్వతీపురంలో చైర్‌పర్సన్ సీటుకు ప్రస్తుతానికి నలుగురు పోటీలో ఉన్నారు.
- సాలూరులో కూటమి పొత్తు ధర్మాన్ని ప్రధాన పార్టీల నాయకులు పాటించలేదు. ఈ మున్సిపాల్టీని జనసేనకు కేటాయించారు. దీనిపై ఆ టీడీపీ నాయ కులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం నాటికి ఇక్కడ టీడీపీకి చెందిన పలువురు నాయకుల సతీమణులు స్వతంత్య్ర అభ్యర్థులుగా చైర్‌పర్సన్ రేసులో ఉండడం చర్చనీయాంశమైంది. సాలూరు మున్సిపాల్టీలో ప్రస్తుతానికి చైర్‌పర్సన్ అభ్యర్థులుగా ఆరుగురు, కౌన్సిలర్లుగా 84 మంది నామినేషన్లు ఉన్నాయి. చైర్‌పర్సన్ అభ్యర్థిగా జనసేన నుంచి గొర్లె విజయకుమారి , టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది చిట్టి సతీమణి శ్యామలతో పాటు తెలుగుదేశం పార్టీ మరో యువ నేత హర్షవర్ధన్ సతీమణి గుల్ల మంజీరా స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వైసీపీ నుంచి రిబ్కారాణి, కాంగ్రెస్ పార్టీ నుంచి సిగడాపు ధనలక్ష్మి, స్వతంత్య్ర అభ్యర్థిగా లచ్చ బత్తుల కల్పన నామినేషన్లు కూడా ఉన్నాయి.
భర్త కౌన్సిలర్‌గా...భార్య చైర్‌పర్సన్‌గా...
సాలూరు చైర్‌పర్సన్ సీటు కోసం ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక రోజు ముందు టీడీపీ యువత నేత, మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ ప్రేమించిన అమ్మాయి మంజీరాతో పెళ్లి పీటలెక్కిన విష యం తెలిసిందే. అయితే ఆ స్థానం జనసేనకు కేటార ుుంచ డంతో తీవ్ర నిరాశ చెందారు. దీంతో చేసేదిలేక హర్ష వర్ధన్ 21వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన భార్య గుళ్ల మంజీరా స్వతంత్ర అభ్యర్థిగా చైర్‌పర్సన్ సీటు కోసం నామినేషన్ వేశారు. ఇక టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది చిట్టి 30వ వార్డు లో కౌన్సిలర్‌గా పోటీ చేస్తుండ గా ఆయన భార్య, మాజీ కౌన్సిలర్ శ్యామల చైర్ పర్సన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా ఉండడం గమనార్హం.
పాలకొండలో...
పాలకొండ నగర పంచాయతీ జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థి పల్లా విజయనిర్మల పోటీలో ఉన్నారు. ఇక్కడ కూటమి పార్టీల నుంచి రెబల్స్ ఎవరూ లేరు. కాగా వైసీపీ నుంచి పాలవలస ఇందుమతి, స్వతంత్య్ర అభ్యర్థిగా భాసూరు శ్రీదేవి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముగ్గురి నామినేషన్లు చైర్‌పర్సన్ బరిలో ఉన్నాయి.
వైసీపీ బీఫారం వద్దు..
గతంలో పాలకొండ కో-ఆప్షన్ మెంబర్‌గా కాంచనమాల సాహు ఉండేవారు. అయితే ఆమె 19వ వార్డు నుంచి కౌన్సిలర్ స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వైసీపీ బీఫారం ఇచ్చి పోటీ చేయమంటే.. తనకొద్దు అంటూ నామినేషన్‌ను బుధవారం ఉపసంహరించుకున్నారు.