Share News

Election మోగిన ఎన్నికల నగారా

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:22 AM

Election Bugle Sounds స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది. కాగా స్థానిక ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో పుర ఎన్నికలు నిర్వహించనున్నారు.

Election   మోగిన ఎన్నికల నగారా

  • అమలులోకి వచ్చిన కోడ్‌

  • తొలి దశలో పుర పోరు

  • రెండో దశలో ఎంపీపీ, జడ్పీటీసీ ..

  • మూడో దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు

  • డిసెంబరు 2తో ప్రక్రియ పూర్తి

పార్వతీపురం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది. కాగా స్థానిక ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో పుర ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల 18న నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 19న వాటిని పరిశీలిస్తారు. 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. 28న పుర ఎన్నికలు నిర్వహించి.. 30న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 19న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 27తో ఉపసంహరణ గడువు ముగుస్తుంది. నవంబరు 3న పోలింగ్‌ జరగనుంది. జరగనున్నాయి. అదేనెల 5న వాటి ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక నవంబరు 26న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 29న రెండో విడత, డిసెంబరు 2న మూడో విడత గ్రామ పంచాయతీ పోలింగ్‌ జరగనుంది. అదే రోజునే సర్పంచ్‌ అభ్యర్థులతో పాటు పాటు వార్డు మెంబర్ల ఫలితాలు ప్రకటించనున్నారు.

జిల్లాలో ఒక నగర పంచాయతీ, రెండు మున్సిపాల్టీల్లో అధ్యక్ష స్థానాలను మహిళలకే కేటాయించారు. పార్వతీపురం పురపాలక సంఘం జనరల్‌ మహిళ, సాలూరు మున్సిపాలిటీ, పాలకొండ నగర పంచాయతీలను బీసీ మహిళకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక జడ్పీ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ చేశారు. పురాలతో పాటు జడ్పీ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు పావులు కదుపుతున్నారు. అధిష్ఠానం ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అత్యధిక మెజార్టీతో తమను గెలిపిస్తాయన్న ఆశతో కూటమి అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేల పనితీరు కూడా తమ విజయానికి దోహదపడు తుందని పలువురు భావిస్తున్నారు. కాగా చైర్మన్‌ పీఠానికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థుల ఖరారుపై పార్టీ అధిష్ఠానాలు కసరత్తు ప్రారంభించాయి.

Updated Date - Oct 15 , 2026 | 12:22 AM