Share News

అనుమానాస్పదస్థితిలో వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:04 AM

మండలంలోని ఇట్లామామిడిపల్లిలో మామిడి దాలమ్మ(48) అనుమానా స్పద స్థితిలో శనివారం తెల్లవారుజామున మృతిచెందింది.

అనుమానాస్పదస్థితిలో వృద్ధురాలి మృతి

రామభద్రపురం, అక్టోబ రు 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇట్లామామి డిపల్లిలో మామిడి దాలమ్మ(48) అనుమానా స్పద స్థితిలో శనివారం తెల్లవారుజామున మృతిచెందింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. దాలమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. ఆమె గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది. అయితే తెల్లవారైనా బయటకు రాకపోవడంతో కుమార్తె మామిడి రమణమ్మ వెళ్లి చూడగా ఇంటిలో మృతిచెంది ఉన్నట్లు గుర్తించింది. అయితే దాలమ్మ తలపై గాయం ఉండడంతో ఎవరైనా హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. అలాగే ఇంటి లో ఉన్న నాలుగు తులాల బంగారం, డబ్బు కూడా పోవడంతో అనుమానానికి తావిస్తోంది. బొబ్బిలి డీఎస్పీ రాకోటి గోవిందరావు సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. ఆమెది సహజ మరణమా, హత్యచేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తు న్నారు. విజయనగరం నుంచి క్లూస్‌ టీం, జాగిలాలను రప్పించి సంఘటనా స్థలా న్ని పరిశీలిస్తున్నారు. బంగారం, డబ్బు కోసమే ఆమెను హత్య చేసినట్లు భావిస్తు న్నారు. సీసీఎస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ డీడీ నాయుడు ఆధ్వర్యంలో తలుపులపై ఉన్న వేలిముద్రలను పరిశీలించారు. దాలమ్మ కుమారుడు మామిడి గణపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 25 , 2026 | 12:04 AM