Share News

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:10 AM

మేలాపువలస గ్రామంలో వృద్ధురాలు మేలాపు సింహాచలం శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది.

 అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

మక్కువ రూరల్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మేలాపువలస గ్రామంలో వృద్ధురాలు మేలాపు సింహాచలం శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. వృద్ధురాలు తన ఇంటిలో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఆమె పిల్లలు వేరే ప్రాంతంలో ఉంటున్నారు. ఏమైందో ఏమో గానీ శనివారం తెల్లవారి పాలు పోసేవారు ఇంటికెళ్లి పిలువగా ఆమె పలకలేదు. ఇంటిలోకి వెళ్లిచూడగా సింహా చలం మృతి చెందినట్టు గుర్తించారు. వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు. వృద్ధురాలి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు మక్కువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ ఎన్‌.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూర ఆసుపత్రికి తరలించారు. కాగా సింహా చలం మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మెడలో బంగా రం చైన్‌ కోసం దుండగులు హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమాన వ్యక్తం చేశారు. సింహాచలం మెడలో 2 తులాల బంగారం చైన్‌ ఉండేదని ఆమె మృతి చెందిన తర్వాత అదిలేదని, ఆమె ముక్కుపుడక విరిగినట్టు ఉందని పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

Updated Date - Mar 22 , 2026 | 12:10 AM