Share News

Woman Dies of Heatstroke! వడదెబ్బతో వృద్ధురాలి మృతి!

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:46 PM

Elderly Woman Dies of Heatstroke! వడదెబ్బకు గురై కురుపాంకు చెందిన మొండి కాంతమ్మ (60) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 Woman Dies of Heatstroke! వడదెబ్బతో వృద్ధురాలి మృతి!

కురుపాం, ఏప్రిల్‌12(ఆంధ్రజ్యోతి): వడదెబ్బకు గురై కురుపాంకు చెందిన మొండి కాంతమ్మ (60) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కృష్ణ, కాంతమ్మ దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉండగా.. వేర్వేరుగా నివసిస్తున్నారు. కాగా ఆదివారం కూలి పనుల నిమిత్తం బయటకు వెళ్లిన కాంతమ్మ వడదెబ్బకు గురైంది. కళ్లు తిరిగి ఉన్నచోటనే కుప్పకూలింది. ఇది గమనించిన భర్త కృష్ణ.. హుటాహుటిన ఆమెను కురుపాం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి చెందింది. వడదెబ్బకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతుండగా.. వైద్యులు మాత్రం ధ్రువీకరించలేదు. ఫిర్యాదు అందకపోవడంతో దీనిపై కేసు నమోదు చేయలేదని మరోవైపు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 12 , 2026 | 11:46 PM