Share News

ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

ABN , Publish Date - May 25 , 2026 | 12:16 AM

మండలంలోని ధర్మవరం గ్రామాని కి చెందిన టి.బంగారమ్మ(65) ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి మృతిచెం దింది.

ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

ఎస్‌.కోట రూరల్‌, మే 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని ధర్మవరం గ్రామాని కి చెందిన టి.బంగారమ్మ(65) ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి మృతిచెం దింది. సీఐ కథనం మేరకు... ధర్మవరం గ్రామానికి చెందిన బంగారమ్మ తన కుమార్తెను చూసేందుకు తిమిడి బయలు దేరింది. ధర్మవరం నుంచి సీతంపే ట జంక్షన్‌కు ఆటలో చేరుకుంది. అక్కడి నుంచి తిమిడి బస్సులో వెళ్లేందుకు వేచిఉంది. ఇదే సమయంలో ధర్మవరం గ్రామానికి చెందిన మధుసూదనరావు రోడ్డుపై బంగారమ్మను చూసి వాహనం ఆపాడు. తాన కుమార్తె వద్దకు వెళ్తున్నానని చెప్పగా తన బండిపై దింపివేస్తానని బంగారమ్మను ఎక్కించాడు. ఉసిరి జంక్షన్‌ వద్ద బంగారమ్మ బండిపై నుంచి జారిపడింది. దీంతో తలకు బలమైన గాయమయ్యింది. వెంటనే మధుసూదనరావు బంగారమ్మ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు సంఘటన స్థలానికి చేరుకొని ఎస్‌.కోట ప్రభుత్వాసుపత్రికి 108లో తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బంగారమ్మ మృతిచెందిందని తెలిపారు. ఈ మేరకు బంగారమ్మ కుమారుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ కేసు నమోదుచేశారు.

Updated Date - May 25 , 2026 | 12:16 AM