పురుగు మందు తాగి వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:23 AM
పురుగు మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండంలోని చినరావుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
కొత్తవలస, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): పురుగు మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండంలోని చినరావుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి సీఐ టీవీ విజయ్‌కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. చినరావుపల్లి గ్రామానికి చెందిన అడిగర్ల దేముడమ్మ(67) గత కొన్ని రోజులుగా అస్తమా వ్యాధితో బాధపడుతూ మనస్తాపానికి గురవుతోంది. ఈక్రమం లో ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం పురుగు మందు తాగింది. గ్రామంలోనే నివాసం ఉంటున్న కుమార్తె లక్ష్మి గమనించి.. విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించింది. దేముడమ్మ అక్కడే చికిత్సపొందుతూ శనివారం మృతి చెందింది. కుమార్తె లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.