Share News

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:52 PM

అగ్నిప్రమాదానికి గురైన హరిజన పాల్తే రు గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన గంట నారాయణమ్మ(74) బాడంగి ఆసుప త్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.

  చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

బాడంగి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): అగ్నిప్రమాదానికి గురైన హరిజన పాల్తే రు గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన గంట నారాయణమ్మ(74) బాడంగి ఆసుప త్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి చలి ఎక్కువగా ఉండడంతో నారాయణమ్మ మంచం కింద కుంపటి పెట్టుకుని నిద్రించింది. దాంతో మంచానికి మంటలు వ్యాప్తిచెందాయి. విషయం గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు తె రిచి ఆమె రక్షించారు. బాడంగి సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నారాయణమ్మ మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె అలజంగి సలోమని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తారకేశ్వరరావు కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 18 , 2026 | 11:52 PM