Pension Money పింఛన్ సొమ్ము కోసం వృద్ధురాలిపై దాడి
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:36 AM
Elderly Woman Attacked for Pension Money పింఛన్ సొమ్ము కోసం వృద్ధురాలిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఆపై నగదుతో పరారయ్యాడు. ఈ ఘటన పార్వతీపురం మండలంలో చోటుచేసుకుంది.
పార్వతీపురం రూరల్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పింఛన్ సొమ్ము కోసం వృద్ధురాలిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఆపై నగదుతో పరారయ్యాడు. ఈ ఘటన పార్వతీపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణపల్లి గ్రామంలో పి.తేరోజమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్ము అందుకుంది. అయితే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి ఇంటిలోకి చొరబడి దాడి చేశాడు.. దీంతో ఆమె స్పౄహ కోల్పోయింది. దీంతో ఆ వ్యక్తి పింఛన్ సొమ్ము తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆదివారం ఉదయం చుట్టుపక్కల వారు చూసి ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయనగరం తరలించారు. అయితే ఘటనపై వృద్ధురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ రంగనాథం ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాజేష్ ఇతర సిబ్బంది జాగిలాలతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.