Share News

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:56 PM

తాళ్లబురిడి వద్ద మంగళ వారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

పార్వతీపురం రూరల్‌, జనవరి13(ఆంధ్రజ్యోతి): తాళ్లబురిడి వద్ద మంగళ వారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. దీనిపై రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదబొండపల్లి గ్రా మానికి చెందిన ఎం.శంకరరావు (60) బైక్‌పై తాళ్లబురిడి నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం బలంగా ఢీ కొంది. దీంతో అక్కడికక్కడే శంకరరావు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపారు.

Updated Date - Jan 13 , 2026 | 11:56 PM