చంపావతిలో వృద్ధుడి మృతి
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:12 AM
చంపావతి నదిలో ప్రమాదవశాత్తు జారి పడి గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామానికి చెందిన కొండపల్లి వీర్రాజు(65) అనే వృద్ధుడు మృతిచెందినట్టు నెల్లిమర్ల ఎస్‌ఐ జి.గోపాలరావు తెలిపారు.
నెల్లిమర్ల, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): చంపావతి నదిలో ప్రమాదవశాత్తు జారి పడి గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామానికి చెందిన కొండపల్లి వీర్రాజు(65) అనే వృద్ధుడు మృతిచెందినట్టు నెల్లిమర్ల ఎస్‌ఐ జి.గోపాలరావు తెలిపారు. ఈ ఘటనపై ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీర్రాజు ఈనెల 26న తన భార్య తో కలిసి విజయనగరం పూల్‌బాగ్‌లో నివాసముంటున్న తన కుమారుల ఇంటికి అమ్మవారి పండుగ సందర్భంగా వెళ్లారు. తిరిగి 30వ తేదీన శుక్రవారం తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో మార్గమధ్యంలో వీర్రాజు నెల్లిమర్ల మండల పరిధిలోని మొయిదనారాయణపట్నం వంతెన వద్ద కాలకృత్యాలు తీర్చు కునే నిమిత్తం చంపావతి నది వద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు నదిలో జారిపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం వల్ల మృతదేహం నెల్లిమర్ల రామతీర్థం రోడ్డు చంపావతి వంతెన వరకు కొట్టుకువచ్చింది. మృతుని కుమారుడు హరినాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించారు.