Share News

గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:04 AM

జామి మండలపరిషత్‌ కార్యాలయం సమీపం లో సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

జామి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): జామి మండలపరిషత్‌ కార్యాలయం సమీపం లో సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎస్‌.కోట మండలం కొట్టాం గ్రామానికి చెందిన పొలిపురెడ్డి కోటరావు (65) అనే యాచకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆయన తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో ఎన్‌.అప్పలనాయుడు ప్రమాద స్థలానికి చేరుకుని వృద్ధుడికి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం తెలియగానే ఏఎస్‌ఐ సుగుణాకర్‌ ఘటనా స్థలానికి చేరుకుని.. కోటరావును 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వృద్ధుడు మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jun 09 , 2026 | 12:04 AM