లారీ ఢీకొని వృద్ధుడి మృతి
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:54 PM
కొత్తవలస జంక్షన్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు.
కొత్తవలస, జూన్ 6(ఆంధ్రజ్యోతి): కొత్తవలస జంక్షన్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటనపై సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలో నివాసం ఉంటున్న బంగారి త్రిమూర్తులు(62) శనివారం ఉదయం ఇంటి నుంచి విద్యుత్ బిల్లు చెల్లించడానికి తన సైకిల్‌పై విద్యుత్ శాఖా కార్యాలయానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా.. కొత్తవలస దుర్గాదేవి ఆలయం వద్దకు వచ్చేసరికి విశాఖపట్నం నుంచి కొత్తవలస వైపు వస్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్. కోట సీహెచ్‌సీకి తరలించారు. కేసును ఎస్‌ఐ జోగారావు దర్యాప్తు చేస్తున్నారు.