Share News

బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:32 AM

సీతంపేటలోని పీఎంఆర్‌సీ కూడలి లో సోమవారం ఆర్టీసీ బస్సు డీకొన్న ఘటనలో వృద్ధుడు మృతిచెందాడు.

బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

సీతంపేట రూరల్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): సీతంపేటలోని పీఎంఆర్‌సీ కూడలి లో సోమవారం ఆర్టీసీ బస్సు డీకొన్న ఘటనలో వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటనలో సిక్కంగూడ గ్రామానికి చెందిన ఆరిక మల్లయ్య (80) తీవ్రగాయాల పాలయ్యాడు. అసుపత్రిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ అమ్మన్నరావు అందించిన వివరాల మేరకు... పాలకొండ నుంచి కొత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్థానిక పీఎంఆర్‌సీ కూడలిలో ఆరిక మల్లయ్యను ఢీకొంది. దాంతో మల్లయ్య బస్సు కింద పడ్డారు. వృద్ధుడి చేతులు బస్సు టైర్‌ కిందపడి నుజ్జయ్యాయి. గాయపడిన మల్లయ్యను స్థానికులు 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతు మృతి చెందారని ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ అమ్మన్నరావు కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 07 , 2026 | 12:32 AM