సోదరుడి హత్య కేసులో అన్న అరెస్టు
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:16 AM
మద్యం మత్తులో తన సోదరుడిని హత్య చేసిన అన్నను రేగిడి మండలం బూరాడ వద్ద అదుపులోనికి తీసుకుని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టినట్టు రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర తెలి పారు.
రాజాం రూరల్, జూలై 27(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో తన సోదరుడిని హత్య చేసిన అన్నను రేగిడి మండలం బూరాడ వద్ద అదుపులోనికి తీసుకుని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టినట్టు రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర తెలి పారు. సోమవారం రాజాం రూరల్ సర్కిల్ కార్యాలయంలో రేగిడి ఎస్‌ఐ బాల కృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం.. రేగిడి మండలం సరసనాపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు గొడే అప్పడు, గొడే కృష్ణ మధ్య ఈనెల 22న రాత్రి భూమి వాటాలకు సంబంధించి వివాదం జరిగిం ది. మద్యం మత్తులో ఉన్న కృష్ణ పెద్దన్నయ్య అప్పడు తాటిచెక్కతో తమ్ముడు కృష్ణ తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. భీతిల్లిన అప్పడు గ్రామం నుంచి పరారయ్యాడు. ఇదిలా ఉంటే గత రెండు దశాబ్దాలుగా తన భర్త కృష్ణకు దూరంగా ఉంటున్న మృతుడి భార్య రాములమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రేగిడి ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అయితే సోమవారం ఉదయం బూరాడ జంక్షన్ వద్ద అప్పడిని రేగిడి ఎస్‌ఐ బాలకృష్ణ సిబ్బందితో కలిసి అదుపులోనికి తీసుకుని, అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు.