Egg Prices Fall గుడ్లు ధర పతనం
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:56 PM
Egg Prices Fall జిల్లాలో కోడిగుడ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 100 గుడ్ల హోల్‌సేల్ ధర రూ.425గా ఉంది. అంటే ఒక్కో గుడ్డు రూ.4.25 పైసలు అయినా.. రిటైల్‌గా మాత్రం రూ.5కు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. కోళ్లఫారాలు నిర్వహిస్తున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆందోళన చెందుతున్న పౌలీ్ట్ర రైతులు
కురుపాం రూరల్, మార్చి7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కోడిగుడ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 100 గుడ్ల హోల్‌సేల్ ధర రూ.425గా ఉంది. అంటే ఒక్కో గుడ్డు రూ.4.25 పైసలు అయినా.. రిటైల్‌గా మాత్రం రూ.5కు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. కోళ్లఫారాలు నిర్వహిస్తున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ (పశ్చి మాసియా) యుద్ధం నేపథ్యంలో రాష్ట్రం నుంచి కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీనికితోడు ఉత్పత్తి కంటే వినియోగం తగ్గింది. దీంతో ఫారం నిర్వాహకుల వద్ద కోడిగుడ్ల నిల్వలు పేరుకుపోయి.. ధరలు తగ్గుముఖం పట్టాయి. అసలు మార్కెట్‌లో మార్పులకు అనుగుణంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఎప్పటికప్పుడు ధరలు నిర్దేశిస్తుంది. అయితే ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర రూ.4.25గా చెబుతున్నా.. రూ.3ల వరకూ పతనం అవుతుందని తెలుస్తోంది. అదే జరిగితే ఫౌల్ర్టీ ఫారం నిర్వాహకులకు కోలుకోలేని దెబ్బ ఖాయం.
- గతేడాది డిసెంబరు 20న గుడ్ల ధరలు దారుణంగా పెరిగాయి. అప్పట్లో రూ.8 వరకూ అమ్ముడుపోయింది. 100 కోడి గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.678కు చేరిన సంగతి తెలిసిందే. అయితే ధర నెమ్మదిగా తగ్గుతోంది. దేశంలో పలు చోట్ల గుడ్డు ధర రూ.3.30కి కూడా పడిపోయినట్లు తెలుస్తోంది.