రాజాంలో యూజీడీ నిర్మాణానికి కృషి
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:51 AM
భవిషత్తులో రింగురోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణాలకు కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు, జిల్లా పరిశీ లకుడు చింతకాయల విజయ్‌కుమార్, ఎమ్మేల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు.
ఎంపీ విజయ్‌కుమార్, రాజాం ఎమ్మెల్యే మురళీ మోహన్
రాజాం, నవంబరు25(ఆంధ్రజ్యోతి): భవిషత్తులో రింగురోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణాలకు కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు, జిల్లా పరిశీ లకుడు చింతకాయల విజయ్‌కుమార్, ఎమ్మేల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు. రాజాం పట్టణాభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం శ్యాంపురంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాజాంలో రూ. 100 కోట్లకుపైగా అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన రహదా రి నిర్మాణంతో పాటు వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాల కోసం రూ.7.50 కోట్లు వెచ్చించామని చెప్పారు. సీఎం సహాయనిధి ద్వారా పేదలకు రూ.2.50 కోట్ల వైద్య సహాయం అందించినట్లు పేర్కొన్నారు.