Share News

సంగాం ఆలయం అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:37 PM

సంగాం ఆలయం అభివృద్ధికి తమ వంతుగా ముఖ్యమంత్రికి వివరించి నిధులు విడుదలకు కృషి చేస్తానని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ హామీఇచ్చారు.

  సంగాం ఆలయం అభివృద్ధికి కృషి
మాటాడుతున్న కోండ్రు మురళీమోహన్‌ :

వంగర , జూన్‌ 24(ఆంధ్రజ్యోతి ): సంగాం ఆలయం అభివృద్ధికి తమ వంతుగా ముఖ్యమంత్రికి వివరించి నిధులు విడుదలకు కృషి చేస్తానని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ హామీఇచ్చారు. బుధవారం ఒని మగ్గురులో దాత ఉదయాన మురళి ఆర్థిక సహాయంతో నిర్మించిన సంగాం ఆలయ ముఖ ద్వారం ప్రారంభించారు. తొలుత సంగాం సంగమేశ్వరాల యంతో పాటు ముఖద్వార ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు బోత్సవాసుదేవరావు, రాజగోపాలనాయుడు, ఎల్‌.కృష్టమూర్తి, ధనలక్ష్మి, పైల వెంకటరమణ, మోహ నరావు, రవి, దుర్గబాబు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 11:37 PM