Share News

Sports Development క్రీడాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:07 AM

Efforts Toward Sports Development జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులను కలెక్టర్‌ ప్రనభాకర్‌రెడ్డి ఆదేశించారు. రాబోయే కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మన్యం విద్యార్థులు బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

  Sports Development క్రీడాభివృద్ధికి కృషి
ఆడలి వ్యూపాయింట్‌ వద్ద నిర్మించిన హోమ్‌స్టేను పరిశీలిస్తున్న కలెక్టర్‌

పాలకొండ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులను కలెక్టర్‌ ప్రనభాకర్‌రెడ్డి ఆదేశించారు. రాబోయే కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మన్యం విద్యార్థులు బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో క్రీడా శిక్షకులు, వ్యాయాయ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ విద్యార్థులకు ఉన్న ఆసక్తిని బట్టి క్రీడల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఏ క్రీడల్లో ఎక్కువగా మెడల్స్‌ వచ్చే అవకాశం ఉందో గుర్తించి.. ఆయా విభాగాల్లో పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి. చదువుతో సమానంగా క్రీడల్లో రాణించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఆటకు ఒక ప్రత్యేక సిలబస్‌ రూపొందించాలి. రోజూ క్రమశిక్షణతో కూడిన ప్రాక్టీస్‌ చేయించాలి. వారికి సరైన పౌష్టికాహారం అందించాలి. రోజూ గంట పాటు పాఠశా లలో కచ్చితంగా స్పోర్ట్స్‌ అవర్‌ నిర్వహించాలి శాస్ర్తీయ పద్ధతుల్లో ఫిట్‌నెస్‌ మెలకువలు నేర్పించడం తప్పనిసరి. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి. ప్రతి జట్టుకు ఒక కెప్టెన్‌ను నియమించాలి. రోజూ నేర్చుకున్న అంశాలను పిల్లలు డైరీలో నమోదు చేసుకోవాలి. తద్వారా వారి ప్రగతిని సమీక్షించుకునే వీలు కలుగుతుంది.’ అని తెలిపారు. ఈ సమావేశంలో పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీధరరావు, డీఈవో పి.బ్రహ్మాజీరావు, జిల్లా పశుసంవర్థక అధికారి మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.

హోమ్‌స్టేల నిర్వహణతో గిరిజన యువతకు ఉపాధి

సీతంపేట రూరల్‌,జనవరి 6(ఆంధ్రజ్యోతి): హోమ్‌స్టేల నిర్వహణ ద్వారా స్థానిక గిరిజన యువత ,మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆడలి వ్యూపాయింట్‌ వద్ద అత్యాధునిక సౌకర్యాలతో పర్యావరణ హితంగా నిర్మించిన బేంబుహోమ్‌(వెదురు)స్టేను ఆయన ప్రారంభించారు. ఇది పర్యాటకులకు సరికొత్త,ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ఇక్కడ బసచేసేందుకు వీలుగా అన్ని వసతులతో కూడిన కాటేజీను అందుబాటులోకి తెచ్చామన్నారు. హోమ్‌స్టేల నిర్వహణలో నాణ్యత పాటించాలని, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్‌ రహిత ప్రాంతంగా ఆడలి వ్యూపాయింట్‌ను తీర్చిదిద్దాలన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 12:07 AM