టీడీపీ బలోపేతానికి కృషి
ABN , Publish Date - May 26 , 2026 | 12:08 AM
టీడీపీ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృష చేయాలని, మహానాడును పార్టీ శ్రేణులు విజయవంతం చేయా లని ఎమ్మెల్సీ, పాలకొండ నియోజకవర్గ పరిశీలకురాలు కావలి గ్రీష్మ కోరారు.
పాలకొండ నియోజకవర్గ పరిశీలకురాలు కావలి గ్రీష్మ
పాలకొండ, మే 25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృష చేయాలని, మహానాడును పార్టీ శ్రేణులు విజయవంతం చేయా లని ఎమ్మెల్సీ, పాలకొండ నియోజకవర్గ పరిశీలకురాలు కావలి గ్రీష్మ కోరారు. సోమవారం పాలకొండ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానికసంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలన్నారు. పార్టీలోని విభే దాలను చక్కదిద్దుతానని తెలిపారు. నియోజకర్గ ఇన్‌చార్జి పడాల భూదేవితో పాటు పార్టీ పాలకొండ మండలాధ్యక్షుడు గండి రామినాయుడు, భామిని మం డల పార్టీ అధ్యక్షుడు భూపతి ఆనందరావు, వీరఘట్టం మండల పార్టీ అధ్య క్షుడు బుజ్జితోపాటు వేర్వేరుగా సమావేశమయ్యారు. కార్యక్రమంలో సీఎల్‌నా యుడు, గుమ్మిడి సింహాద్రి, సుమంత్‌నాయుడు, శ్రీనివాసరావు, ఆకుల కుమార్, త్రినాఽథరావు పాల్గొన్నారు.కాగా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్న శ్రేణులను గుర్తించాలని నాయకులు గంటా సంతోష్‌కుమార్, కర్నేన అప్పలనాయుడు, జాడ శ్రీధర్ గ్రీష్మాకు కోరారు.
మహానాడును విజయవంతం చేయాలి
పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర
పార్వతీపురం, మే 25 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో మహానాడును విజయవంతం చేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర కోరారు. సోమవారం స్థానిక టీడీసీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 11 కస్లర్లు వారీగా నిర్వహించనున్న మహానాడు విజయవంతం చేసేందుకు నియో జకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో ఎమ్మెల్యే విజయచంద్ర, నియోజకవర్గ పరిశీలకుడు కోరాడ రాజబాబు నిర్వహించారు.
27, 28 తేదీల్లో మహానాడు
పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పడాల భూదేవి
పాలకొండ, మే 25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకులు, అన్ని విభాగాల కార్యకర్తలు ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మినీ మహానాడును విజయవంతం చేయాలని పార్టీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి కోరారు. సోమవారం పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డుల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి అధ్య క్షతన జరిగింది. ఈ సందర్భంగా మహానాడు ఏర్పాట్లపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శాసపు సర్వారావు, ఆకుల కుమార్, గుమ్మిడి ఉమామహేశ్వరరావు, దుర్గారావు, దుప్పాడ నారాయణరావు, గుమ్మిడి శంకరరావు, గుమ్మిడి కృష్ణ, పొన్నాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.