Share News

టీడీపీ బలోపేతానికి కృషి

ABN , Publish Date - May 17 , 2026 | 12:02 AM

22

 టీడీపీ బలోపేతానికి కృషి
మాట్లాడుతున్న తోయక జగదీశ్వరి:

గుమ్మలక్ష్మీపురం, మే 16 (ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి కోరారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లా డుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. రానున్న స్థానికసంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయానికి కృషి చేయాలన్నారు. గ్రామాల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కాగా గరుగుబిల్లి మండలంలోని గొట్టివలస గ్రామానికి చెందిన బోను హర్షవర్ధన్‌ నాయుడుకు, కొమరాడ మండలం కూనేరు గ్రామానికి చెందిన కొండ గొర్రె జెస్సిక అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఉన్నారన్న సంగతి ఎమ్మెల్యే తెలుసుకొని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందేలా చర్యలు తీసుకున్నారు. హర్షవర్ధన్‌కు రూ.1,02,291, జెస్సికకు రూ.21 వేలు చెక్కులను ఆమె క్యాంప్‌ కార్యాలయంలో శనివారం అందించారు. కార్యక్రమంలో నాయకులు బొంగు సురేష్‌, కడ్రక కళావతి, శేఖర్‌పా త్రుడు, నారాయణస్వామి, అంబటి రాంబాబు, పురుషోత్తంనాయుడు, సుమన్‌, రాఘవ, సింహాచలం, బలరాం, పూర్ణచం ద్రరావు, దివాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 12:02 AM