Share News

టీడీపీ బలోపేతానికి కృషి

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:50 PM

నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు.

 టీడీపీ బలోపేతానికి కృషి
పార్టీలో చేరినవారికి కండువాకప్పి ఆహ్వానిస్తున్న మంత్రి శ్రీనివాస్‌:

గజపతినగరం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. ప్రజల ఆశీస్సులతో 20 ఏళ్లు వరకు కూటమి ప్రభుత్వం అధికా రంలో ఉంటుందని చెప్పారు. ఆదివారం గజపతినగరంలోని టీడీపీ కార్యా లయంలో దత్తిరాజేరు మండలంలోని బూపాలరాజపురానికి చెందిన మిత్తి రెడ్డి వెంకటరామసింహచలం(రాము) పోలీస్‌ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలి తన అనుచరులతో పార్టీలో చేరారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడు తూ గ్రామాల్లో ప్రతిపక్షంతో పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని, జగన్‌ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యువతకు భవిష్యత్‌ ఉండదన్న ఆలోచన అందరిలో ఉండా లని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరువ చేసినట్లు తెలిపారు. దత్తిరాజేరు మండలాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకువచ్చేలా కృషి చేస్తాన న్నారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీనాయకులు కొండపల్లి కొండలరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మక్కువ శ్రీధర్‌, మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, ఏఎంసీ చైర్మన్‌ పీవీవీ గోపాలరాజు, మాజీ ఎంపీపీ బెజవాడ రాజేశ్వరి, దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ మండలాల టీడీపీ అధ్యక్షులు చప్పా చంద్రశేఖర్‌, రాపాకఅచ్చుంనాయుడు, కొండపల్లి బాస్కరనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 11:50 PM