ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - May 09 , 2026 | 12:37 AM
ప్రజా సమస్యల పరిష్కారమే తన అజెండా అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అన్నారు.
పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర
పార్వతీపురం రూరల్, మే 8(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే తన అజెండా అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వ హించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిం చి, అక్కడికక్కడే కొన్నింటికి పరిష్కార మార్గా న్ని చూపారు. మరికొన్ని సమస్యలపై సంబం ధిత అధికారులతో చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
దేవాలయాల నిర్మాణానికి నిధులు
సీతానగరం, మే 8(ఆంధ్రజ్యోతి): దేవాల యాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని ఎమ్మెల్యే బోనెల విజ యచంద్ర అన్నారు. కొత్తవలస గ్రామంలోని రామాలయం నిర్మాణ కార్యక్రమంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడు తూ కూటమి ప్రభుత్వం జీర్ణ దేవాలయాల పునరుద్ధరణకు కంకణం కట్టు కుందన్నారు. అందులో భాగంగా ఈ గ్రామా నికి ప్రభుత్వం రూ.40లక్షలు నిధులు మంజూ రు చేసిందని తెలిపారు. యాదపు కులస్తులు తమ కుల దైవమైన శ్రీకృష్ణ మందిరం నిర్మించుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. దీంతో పాటు బలిజిపేట మం డలం గళావల్లి, పార్వతీపురం మండలం దుక్కువాని వలసల లో కూడా నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయని వివరించారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రౌతు వేణుగో పాల్ నాయుడు, భోగి శంకరరావు, జి.వెంట నాయుడు, గ్రామ నాయకులు యాండ్రాపు వాసుదేవరావు, రెడ్డి అప్పలనాయుడు, రెడ్డి గోపీనాధ్ పాల్గొన్నారు.