Share News

సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:05 AM

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్యెల్యేలు, టీడీపీ నాయకులు తెలిపారు. బుధవారం జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ టీడీపీ కార్య క్రమం నిర్వహించారు.

సమస్యల పరిష్కారానికి కృషి
చీపురుపల్లి: పథకాల కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే కళా వెంకటరావు

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్యెల్యేలు, టీడీపీ నాయకులు తెలిపారు. బుధవారం జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ టీడీపీ కార్య క్రమం నిర్వహించారు.

ఫచీపురుపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిం చడంతోపాటు కష్ట సుఖాల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. మండలంలోని పర్లలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా సుపరిపాలన- రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై డోర్‌ టు డోర్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పుచ్చా విజయ కుమార్‌, పార్టీ నాయకులు దన్నాన రామచంద్రుడు, సూరపునాయుడు, మహంతి అప్పలనాయుడు, శనపతి శ్రీనివాసరావు, గొర్లె లక్ష్మణరావు, గంట్యాడ సత్యనారాయణ, మీసాల శ్రీధర్‌, వెంపడాపు లక్ష్మునాయుడు పాల్గొన్నారు.

ఫఎస్‌.కోట రూరల్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): తలారీ పంచాయతీ ఉసిరిలో బుధవారం మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, మాజీ సర్పంచ్‌ రెడ్డి భవానీ ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరించి వారి బాగోగులు తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు డొకుల అచ్చెన్నాయుడు, ఎంపీటీసీ రాయవ రపు చంద్రశేఖర్‌ పాల్గోన్నారు.

ఫరేగిడి, జూలై 29,(ఆంధ్రజ్యోతి): రెండేళ్లులో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన నమ్మకం నిలబెట్టుకొని, సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పనిచేసినట్లు రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి పొగిరి బుచ్చిబాబు పేర్కొన్నారు. మండలంలో సంకిలిలో టీడీపీ రెండేళ్లు పాలనపై ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో టీడీపీ నాయకులు కర్రి రమణ, గంగు కృష్ణారావు, ఎస్‌.సింహాచలం గురు వాన ధనంజయ్‌రావు పాల్గొన్నారు.

ఫగజపతినగరం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పేదలకు ప్రభుత్వం అండగా ఉం టుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి తెలిపారు. పాతశ్రీరంగ రాజపురంలో రెండేళ్లనమ్మకం-సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీచేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ గోపాలరాజు, ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:05 AM