Share News

రైతుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:27 AM

చెరకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.

 రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు సమస్యలను వివరిస్తున్న సుగర్‌ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు

  • పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

పాలకొండ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): చెరకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. శుక్రవారం వీరఘట్టం క్యాంపు కార్యాలయంలో విజయన గరం జిల్లా సంకిలిలోని ఐఈడీ ప్యారీ సుగర్‌ ఫ్యాక్టరీని 2027-28 క్రషింగ్‌ సీజన్‌లో మూసివేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించడంతో చెరకు రైతుల కు కలిగే నష్టాన్ని సంకిలి సుగర్‌ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు మజ్జి దుర్గారావు, నాగరాజు, నిష్టల సూర్యప్రకాష్‌, భుక్తా జయకృష్ణ దృష్టికి తీసుకె ళ్లారు. ఈసందర్భంగా చెరకు సాగు విస్తీర్ణం, రైతులకు లభిస్తున్న ధర, సాగు ఖర్చులు, గిట్టుబాటు తదితర అంశాలను ఎమ్మెల్యే అడిగితెలుసుకున్నారు. ఏపీ చెరకు రైతుసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బుడితి అప్పలనాయుడు, మార్కెట్‌యార్డు మాజీచైర్మన్‌ చింత సంగంనాయుడు రైతుల సమస్యల ను వివరించారు. చెరకు రైతులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీఇచ్చారు.

Updated Date - Sep 05 , 2026 | 12:27 AM