Share News

Ambedkar’s Ideals అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:27 PM

Efforts to Realize Ambedkar’s Ideals రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఘనంగా అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు.

  Ambedkar’s Ideals అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి
అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్న దృశ్యం

పార్వతీపురం/పార్వతీపురం టౌన్‌/బెలగాం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఘనంగా అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా కాలనీ ఆసుపత్రి కూడలి వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సమాజంలో ప్రతిఒక్కరికీ గుర్తింపు తీసుకొచ్చి.. సమాన హక్కులు కల్పించిన మహాన్నత వ్యక్తి అంబేడ్కర్‌ అని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సంస్కర్త, న్యాయవేత్తగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొని యాడారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌ స్ఫూర్తితో నేటి తరం ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ వైశాలి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 11:27 PM