Share News

Alluri's Vision అల్లూరి ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:11 AM

Efforts to Realize Alluri's Vision స్వాతంత్య్ర సమరయోధుడు , మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించారు.

 Alluri's Vision అల్లూరి ఆశయ సాధనకు కృషి
అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం, జూలై 4(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు , మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ వారితో పోరాడి చిన్నవయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ వీరుడని తెలిపారు. అల్లూరి దేశభక్తి, ధైర్యం నేటి తరానికి ఆదర్శమన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖాధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీఎస్‌సీ పనుల్లో నిర్లక్ష్యం వద్దు

జిల్లాలో మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ (సీఎస్‌సీ) పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలితో, ఇంజనీరింగ్‌ శాఖాధికారులతో సమీక్షించారు. ఈ నెల 15 నాటికి అంగన్‌వాడీ పనులు, నెలాఖరుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ నిర్మాణాలన్నీ పూర్తి కావాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఏ పనులూ ఉండడానికి వీలులేదన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో కె.మాధురి, జిల్లా సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ శాఖాధికారులు ఎం.శ్యామల, ఎ.విజయశాంతి, ఇ.అప్పన్న, ఐసీడీఎస్‌ పీడీ టి.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:11 AM