నులిపురుగుల నివారణకు కృషి
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:08 AM
జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా పిల్లలకు మాత్రలు అందేలా చూడాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జీవనరాణి ఆదేశించారు.
డీఎంహెచ్‌వో జీవనరాణి
డెంకాడ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా పిల్లలకు మాత్రలు అందేలా చూడాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జీవనరాణి ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఆఫీస్ అమలు చేయాలని ఆదేశించారు. పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేయించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీసీ చంద్రశేఖర్‌రాజు, హెల్త్ ఎడ్యుకేటర్ అనిల్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పీహెచ్‌సీ పరిధిలో ఉన్న 42 అంగన్‌వాడీ, 47 స్కూల్స్, కాలేజీలలోని ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలందరికీ అల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వనున్నట్టు స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ అనూష తెలిపారు.