Tribal Culture ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకు కృషి
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:18 AM
Efforts to Preserve Tribal Culture ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్, కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కుక్కిడి గ్రామంలో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయ యువ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
గుమ్మలక్ష్మీపురం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్, కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కుక్కిడి గ్రామంలో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయ యువ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ జగదీశ్వరి హాజరై మాట్లాడారు. గిరిజన సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఆదివాసీ సమ్మేళనం వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం గిరిజనుల జీవన విధానం, సంస్కృతిని ప్రతిబింబించే ఆదివాసీ వికాసిని పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు, సంస్కృతి పరిరక్షణకు తమవంతు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా గిరిజన యువత నిర్వహించిన ప్రదర్శనలు అలరించాయి. థింసా నృత్యం, డప్పు వాయిద్యాలు, గిరిజన కళారూపాలు ఆకట్టుకున్నాయి. అటవీ ఉత్పత్తులను సైతం ప్రదర్శించారు. కార్యక్రమంలో యాక్షన్ ఇన్ రూరల్ టెక్నాలజీ అండ్ సర్వీస్ నిర్వాహకులు, గిరిజన నాయకులు మంచాల పారమ్మ, ఆరిక చంద్రశేఖర్, రొబ్బ లోవరాజు, ఇంటికుప్పల రామకృష్ణ, దుక్క సీతారాం, కోలక గౌరమ్మ, గిరిజన కళాకారుడు తోయక నాగభూషణ్, తహసీల్దార్ ఎన్.శేఖరం పాల్గొన్నారు.