Educational విద్యా సామర్థ్యాల పెంపునకు కృషి
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:03 AM
"Efforts to Enhance Educational Capabilities" ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు సూచించారు. శనివారం ఉల్లిభద్ర జడ్పీ ఉన్నత స్కూల్‌లో నిర్వహించిన పాఠశాల సముదాయ సమావేశాన్ని తనిఖీ చేశారు.
గరుగుబిల్లి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు సూచించారు. శనివారం ఉల్లిభద్ర జడ్పీ ఉన్నత స్కూల్‌లో నిర్వహించిన పాఠశాల సముదాయ సమావేశాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించాలన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు నిర్వహించి తగిన గుర్తింపు తీసుకురావాలని ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి వారిలో భయం పోగొట్టాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. భోజన నిర్వహణపై విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. పాఠశాలల్లో శుభ్రత పాటించి నిబంధనల మేరకు పథకాన్ని నిర్వహించాలన్నారు. లోపాలు ఉన్నట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిశీలనలో ఎంఈవోలు జోగారావు, కె.కొండలరావు, పలు పాఠశాలలకు చెందిన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్లస్టర్ సమావేశాలతో విద్యాభివృద్ధి
వీరఘట్టం: పిల్లల విద్యాభివృద్ధికి క్లస్టర్ సమావేశాలు దోహదపడతాయని డీఈవో బ్రహ్మాజీరావు అన్నారు. శనివారం వీరఘట్టం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన క్లస్టర్ సమావేశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల స్థాయిను తెలుసుకొని పలు సూచనలు చేశారు. దీక్షయాప్‌లో అన్ని కోర్సులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గౌరునాయుడు, బి.సోంబారు, జి.కోటేశ్వరరావు, కె.రాజారావు, మధుకిషోర్ తదితరులు పాల్గొన్నారు.