తప్పులు లేని పాసు పుస్తకాల పంపిణీకి కృషి
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:51 PM
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తప్పులు లేని పాసు పుస్త కాలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తోందని ప్రజా ప్రతి నిధులు, అధికారులు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తప్పులు లేని పాసు పుస్త కాలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తోందని ప్రజా ప్రతి నిధులు, అధికారులు అన్నారు. జిల్లాలోని పలు చోట్ల మంగళవారం పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు.
విజయనగరం రూరల్, ఫిబ్రవరి 3(ఆంధ్ర జ్యోతి): తప్పులు లేని పట్టాదారు పాసు పుస్తకాలు అం దించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అన్నారు. ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదా రు పాసుపుస్తకాలను ఆమె మంగళవారం సారిక గ్రా మంలో రైతులకు పంపిణీ చేశారు. మండల అధికారు లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
బాబామెట్టలో ని బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులకు ప్రభుత్వం అందజేసిన కళ్లద్దాలను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మంగళవారం కళ్లద్దాలు పంపిణీ చేశారు.
గుర్ల, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): గరికవలస గ్రా మాన్ని జేసీ ఎస్.సేతుమాధవన్ మంగళవారం సంద ర్శించారు. అక్కడి రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన గరికివలసలోని రేషన్ డిపోను తనిఖీ చేశారు. తహసీల్దార్ ఆదిలక్ష్మి, సీఎస్‌డీటీలు, ఆర్‌ఎస్‌డీటీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
లక్కవరపుకోట, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వమని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. మంగళవారం ఆమె దాసుల్లు పాలెం గ్రామంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, చొక్కాకుల మల్లునాయుడు, కోళ్ల భూపాల్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఎటువంటి భూ సమస్యలు లేకుండా ఉండేందుకే ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తోందని మా ర్క్‌ఫెడ్ చైర్మన్, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. మంగళవారం నందిగాం గ్రామంలో ఆయన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పలువురు రైతు లు తమ భూములు ప్రభుత్వం తీసుకోకుండా కాపా డాలని ఆయనకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ మండల అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, తహసీల్దార్ ఎం.రమణమ్మ, రీసర్వే డీటీ రవి, సర్పంచ్ గరె మురళీమోహనరావు, ఏఎంసీ డైరెక్టర్ జి.వెంకట రమణ, వీఆర్వోలు పాల్గొన్నారు.
రేగిడి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): భూసర్వేతో తప్పులు లేని పాసు పుస ్తకాలు అందించవచ్చని తహసీల్దార్ కృష్ణలత, డిప్యుటీ తహసీల్దార్ ఈశ్వరరావు అన్నారు. మంగళవారం వన్న లి గ్రామంలో వారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. సర్పంచ్ ప్రతినిధి రమణ పాల్గొన్నారు.