Share News

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:02 AM

గ్రామాల్లో మౌలి క వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

  • మంత్రి శ్రీనివాస్‌

గంట్యాడ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మౌలి క వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. లక్కిడాం గ్రామం లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్ర త పాటించాలని కోరారు. అనంతరం గ్రామంలోని ఇం టింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్‌ నాయుడు, కొప్పలవెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అల్లు విజయకుమార్‌, టీడీపీ నాయకులు కె.జగన్నాథం, వాసిరెడ్డి పవన్‌ కుమార్‌, కిలపర్తి పరదేశినాయుడు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో ప్రతిఒక్కరికీ గుర్తింపు..

దత్తిరాజేరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): టీడీపీలో పనిచేసిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు కల్పిస్తున్నా మని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. విజయనగ రంలోని తన క్యాంపు కార్యాలయంలో మైటీడీపీ యాప్‌ ఉపయోగించడంలో రెండో స్థానం సాధించిన దత్తిరాజే రు మండలంలోని టి.బూర్జవలసకు చెందిన బెజవాడ ఈశ్వర్‌ను మంత్రి అభినందించారు. ఈయనకు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సైకిల్‌, టోపీని అందజేశారు.

Updated Date - Aug 11 , 2026 | 12:02 AM