Malaria మలేరియా నియంత్రణకు కృషి
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:44 PM
Efforts to Control Malaria జిల్లాలో మలేరియా నియంత్రణకు వైద్యులు మరింత కృషి చేయాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. ‘మా ఊరికి మలేరియా వచ్చింది’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దిగువమెండంగిలో ఆయన పర్యటించారు.
సాలూరు రూరల్, ఫిబ్రవరి6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా నియంత్రణకు వైద్యులు మరింత కృషి చేయాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. ‘మా ఊరికి మలేరియా వచ్చింది’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దిగువమెండంగిలో ఆయన పర్యటించారు. గ్రామంలో మలేరియా బాధితుని పరామర్శించి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.ఆ ప్రాంతంలో పారిశుధ్యం, డ్రైడే నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వైద్యసేవలపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత గ్రామంలో నిర్వహి స్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించారు. ఎటువంటి వ్యాధులు ప్రబలినా తక్షణ సమాచారమందే విధంగా వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యసిబ్బంది, పంచాయతీ కార్యదర్శి తదితరులతో సమన్వయం చేసుకొని గ్రామ ముస్తాబు నిర్వహణకు పనిచేయాలన్నారు. ఆయన వెంట జిల్లా ఎన్‌సీడీ అధికారి జగన్మోహనరావు, డీఎంవో మణి, మెడికల్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డి.శివకుమార్, కౌశిక్, డీఎల్‌పీవో నాగభూషణ, తోణాం వైద్యాధికారి అజయ్, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.