గిరిజన భవనం నిర్మాణానికి కృషి
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:06 AM
గుమ్మలక్ష్మీపురంలో గిరిజన భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరుకు తన వంతు కృషి చేస్తానని కురుపాం ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం భద్ర గిరి జంక్షన్‌లో ఉన్న స్థలాన్ని తహసీల్దార్ శేఖరం భవన నిర్మాణ కమిటీకి జగ దీశ్వరి చేతుల మీదుగా అప్పగించారు.
గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురంలో గిరిజన భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరుకు తన వంతు కృషి చేస్తానని కురుపాం ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం భద్ర గిరి జంక్షన్‌లో ఉన్న స్థలాన్ని తహసీల్దార్ శేఖరం భవన నిర్మాణ కమిటీకి జగ దీశ్వరి చేతుల మీదుగా అప్పగించారు. కార్యక్రమంలో గిరిజన భవన నిర్మాణ కమిటీనాయకులు, ఎస్టీ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు, శంకరరావు, మం డంగి రమణ, ఉపాధ్యాయులు శంకరరావు, తహశీల్దార్ శేఖరం పాల్గొన్నారు.
సీఎం దృష్టికి తీసుకువెళ్తా
పాలకొండ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి):శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కాలువ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరితో కలిపి తోటపల్లి సమస్యను ముఖ్యమంత్రి దృషికి తీసుకొని వెళ్తానని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం కురుపాం ఎంపీడీవో కార్యాలయం వద్ద తోటపల్లి కుడి, ఎడమ ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు చేయించి సహకరిం చాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పల నాయుడు వినతిపత్రాన్ని అందజేశారు.