Goal లక్ష్య సాధనకు కృషి
ABN , Publish Date - Sep 15 , 2026 | 11:58 PM
Efforts to Achieve the Goal ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖాధికారులతో సమీక్షించారు. గ్రామాల పరిశుభ్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, కేవలం ఫొటోల కోసమే కాకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు.
పార్వతీపురం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖాధికారులతో సమీక్షించారు. గ్రామాల పరిశుభ్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, కేవలం ఫొటోల కోసమే కాకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శిక్షణ పొందడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ‘ నా పాఠశాల, నా తోట’ కార్య క్రమంలో భాగంగా ప్రతి అధికారి ఒక పాఠశాలను దత్తత తీసుకోవాలన్నారు. సమావేశాల్లో అధికారులు కేవలం ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలన్నారు. ప్రతి నెలా 9 లేదా ముందు రోజున రెవెన్యూ డేను పాటించాలని , నిర్ణీత మండలాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. 22ఏభూములకు సంబంధించి పనులను పెండింగ్‌లో పెట్టరాదన్నారు. మీడియాలో వచ్చే వార్తలపై తక్షణమే స్పందించి విచారణ జరపాలన్నారు. నులిపురుగుల నివారణలో భాగంగా ఆరు నెలలకొకసారి ఆల్‌బెండాజోల్ మాత్రను తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నారు. 500లోపు జనాభా ఉన్న గ్రామాలకు సురక్షిత నీరు అందించాలని సూచించారు. కూలీలకు రూ.300 వేతనం, విద్యార్థులు, యువతకు స్థానికంగా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వాటర్‌ఫాల్స్ జిల్లాగా ప్రచారం చేయాలని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక డిస్కౌంట్ ధరలతో బైక్‌మేళాలు నిర్వహించాలన్నారు. ప్రోటోకాల్ ఖర్చు తగ్గించుకోవడానికి రెవెన్యూ అసోసియషన్‌లో లేదా వీఆర్వోల పేరుతో పెట్రోల్ బంకుల ఏర్పాటును పరిశీలించాలన్నారు.