Share News

మునిసిపాలిటీ అభివృద్ధికి కృషిచేయాలి

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:23 AM

మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర కోరారు. పురపాలక సంఘంలో స్వతంత్య్ర అభ్యర్థులుగా 10, 19 వార్డుల నుంచి కౌన్సిలర్లగా ఎన్నికైన ఎన్‌.శ్రీకాంత్‌, పి.దుర్గాప్రసాద్‌ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

మునిసిపాలిటీ అభివృద్ధికి కృషిచేయాలి
టీడీపీలో చేరిన కౌన్సిర్లతో ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర కోరారు. పురపాలక సంఘంలో స్వతంత్య్ర అభ్యర్థులుగా 10, 19 వార్డుల నుంచి కౌన్సిలర్లగా ఎన్నికైన ఎన్‌.శ్రీకాంత్‌, పి.దుర్గాప్రసాద్‌ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆదివారం స్థానిక తెలు గుదేశంపార్టీ కార్యాలయంలో నిర్వహించినకార్యక్రమంలో వీరికి ఎమ్మెల్యే విజయ చంద్ర పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో విజయాన్ని అందించారని, అభివృద్ధి చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని కోరారు.అనంతరం వారిరువురూ మాట్లాడుతూ పార్వతీపు రం పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బెలగాం జయ ప్రకాష్‌నారాయణ, టీడీపీ పట్టణాధ్యక్షుడు కోలా ముధు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మజ్జి వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2026 | 12:23 AM