Share News

జంతు సంక్షేమానికి కృషి చేయాలి: ఆర్డీవో

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:26 AM

జంతు సంక్షేమానికి అధికారులంతా కృషి చేయాలని విజయనగరం ఆర్డీవో దాట్ల కీర్తి సూచించారు.

జంతు సంక్షేమానికి కృషి చేయాలి: ఆర్డీవో

విజయనగరం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): జంతు సంక్షేమానికి అధికారులంతా కృషి చేయాలని విజయనగరం ఆర్డీవో దాట్ల కీర్తి సూచించారు. శుక్రవారం సాయంత్రం విజయనగరంలోని తన చాంబర్‌లో ఆమె జంతు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలో ఉన్న పశువుల సంతల్లో పశువులు హింసకు గురికాకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అక్రమ రవాణా జరగకుండా పోలీసులు నిఘా పెట్టాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ గోసంరక్షణ సమైఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణా, పశు మాంసం విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. వెంటనే ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ డీడీ దామోదర్‌, మండలా తహసీల్దార్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:26 AM