Share News

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:05 AM

సచివాలయ సిబ్బంది సకాలంలో స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
కొమరాడ: టీడీపీలో చేరిన నాయకులతో జగదీశ్వరి

  • ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): సచివాలయ సిబ్బంది సకాలంలో స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు. మం డలంలోని ఇరిడి పం చాయతీ కేంద్రంలో రూ.45.60 లక్షలతో నిర్మించిన స్వర్ణ ఇరిడి సచివాలయ భవనాన్ని మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బిడ్డిక పద్మావతి, కూటమి నాయకులు కడ్రక కళావతి, అడ్డాకుల నరేష్‌, బిడ్డిక కొండలరావు, వెంకటరావు, ఆరిక జానకి, బుజ్జేశ్వరరావు, ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు. కాగా టీడీపీ తరపున బీసీలకు 40 శాతం సీట్లు కేటా యించడంతో తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ చిత్రపటాలకు గుమ్మలక్ష్మీపురంలో పాలాభిషేకం నిర్వహించారు. కాగా కొమరాడ మండలం లోని విక్రంపురం, నందపురం, తమందొరవలస, చంద్రంపేట, దుగ్గి, కళ్లికోటకు చెందిన 60 వైసీపీ కుటుంబాలు, మాజీ సర్పంచ్‌ రామకృష్ణ టీడీపీ చేరారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆమె కార్యాలయంలో పార్టీ కండువాలువేసి సాద రంగా ఆహ్వానించారు. ఇరిడి పంచాయతీ కన్నయ్యగూడకు చెందిన పత్తిక చిన్నారావుతో పాటు మూడు వైసీపీ కుటుంబాలకు కూడా ఆహ్వానించారు.

విక్రంపురం పంచాయతీ నుంచి 60 కుటుంబాలు

కొమరాడ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని విక్రంపురం పంచా యతీలో వైసీపీ నుంచి టీడీపీలోకి మంగళవారం పలువురు చేరారు. పంచా యతీ పరిధిలోని మాజీ ఉపసర్పంచ్‌ సిరిపురపు రామకృష్ణతోపాటు దుగ్గి, తమ్మందొరవలస, చంద్రంపేట గ్రామాల నుంచి 60కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు టీడీపీ తీర్ధంపుచ్చుకున్నారు. ఈమేరకు వారికి ఎమ్మెల్యే, విప్‌ జగదీశ్వరీ పార్టీ కండువా వేసి గుమ్మలక్ష్మిపురంలో స్వాగతం పలికారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్‌ టీడీపీ రైతు అధ్యక్షుడు దేవకోటి వెంకటనా యుడు, టీడీపీ మండలాధ్యక్షుడు శేఖర్‌పాత్రుడు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గార గౌరీశంకర్‌, వెంకటనాయుడు, నంగిరెడ్డి మధుసూదనరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:05 AM