అత్యధిక రాబడి సాధించేందుకు కృషి చేయాలి
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:17 AM
జిల్లా లో అత్యధిక రాబడి సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు.
ఖాళీగా ఉన్న గనులను వినియోగంలోకి తీసుకురావాలి
రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్ మీనా
విజయనగరం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లా లో అత్యధిక రాబడి సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రామ సుందర్ రెడ్డితో కలిసి ఎక్సైజ్, గనుల శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడత మద్యం దుకాణా ల పునరుద్ధరణ ప్రక్రియలో విజయనగరం జిల్లా ఇత ర జిల్లాలు కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. మిగిలిపోయిన మద్యం దుకాణాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నగరంలో ఎక్సైజ్ శాఖ ఆధీనంలో ఉన్న ఎకరా స్థలంలో ఎక్సైజ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధిక ఆదాయం లక్ష్యంగా ఖాళీగా ఉన్న గనులను ఉపయోగంలోకి తీసుకురావడాని కి చర్యలు తీసుకోవాలన్నారు. గనుల కోసం దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులను పరిశీలించి ఎన్‌వోసీలు ఇచ్చి ఆదాయం పెంచాలని సూచించారు. అందరికీ ఉచిత ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిష నర్ శ్రీనివాస చౌదరి, జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ సూప రింటెండెండ్ బమ్మిడి శ్రీనాధుడు, ఎస్.సహాదేవ, గను ల శాఖ డీడీ సూర్యచంద్రరావు పాల్గొన్నారు.