పట్టణాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:19 AM
పట్టణాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాన్నానని టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి బెలగాం కరుణ తెలిపారు. అమూల్యమైన ఓటును తనతో పాటు కౌన్సిలర్లకు వేస్తే ఐదేళ్లపాటు మీ అందరికి సేవకురాలిగా ఉంటానని చెప్పారు.
పార్వతీపురంటౌన్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పట్టణాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాన్నానని టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి బెలగాం కరుణ తెలిపారు. అమూల్యమైన ఓటును తనతో పాటు కౌన్సిలర్లకు వేస్తే ఐదేళ్లపాటు మీ అందరికి సేవకురాలిగా ఉంటానని చెప్పారు. శనివారం మునిసిపాలిటీలోని 21, 22వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత 21వ వార్డులో గల బంగారమ్మతల్లి ఆలయంలో చైర్పర్సన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో సంక్షేమ పథకాలతోపాటు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందుకు ఇచ్చిన సూపర్స్ సిక్స్ హామీలను నూటికి నూరుశాతం పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశా రన్నారు. మునిసిపాలిటీలోని ప్రధాన సమస్యలపై ప్రత్యేక సారించి, పరిష్కరించను న్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మునిపిపల్ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యతను ఇవ్వడం సంతోషదాయకమన్నారు. మహిళా సాధికారిత కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. వచ్చేనెల ఒకటో తేదీన జరిగే ఎన్నికల్లో 32 వార్డుల్లో పోటీచేస్తున్న కూటమి అభ్యర్థులతో పాటు తను గెలిపించే బాధ్యత మీదేనని తెలిపారు. రెండు వార్డుల్లో ఇంటింటికి వెళ్లి కూట మి ప్రభుత్వంలో ఉన్న నాతో పాటు కౌన్సిలర్లను గెలిపించాలని కోరారు.