గ్రామాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:27 PM
గ్రామాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు
భోగాపురం, జూన్3(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. బుధవారం మండలంలోని చెరుకుపల్లిలో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ సచివాలయాల ద్వారా ప్రజలకు సమయనుకూలంగా మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో ఎంపీడీవో స్వరూపరాణి, తహసీల్ధార్ జి.హేమంత్‌కుమార్, జేఈ గణేష్, నాయ కులు పల్లంట్ల జగదీష్ పాల్గొన్నారు.