Share News

గ్రామాల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:54 PM

అన్ని గ్రామాల నూ అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి

  • నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవి

  • రహదారుల మరమ్మతులకు శంకుస్థాపన

భోగాపురం, మార్చి10(ఆంద్రజ్యోతి): అన్ని గ్రామాల నూ అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. ముంజేరు గ్రా మ సమీపంలో బీటీ రోడ్డు మరమ్మతులకు ఆమె మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజలు సహ కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నెల్లిమర్ల, మార్చి 10(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల మండలాన్ని ఆదర్శ మం డలంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె రామతీర్థంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. అనంతరం రణస్థలం- నెల్లిమర్ల రోడ్డు రీసర్ఫేసింగ్‌ పనులకు ఆమె శంకుస్థాప న చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పూసపాటిరేగ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని పోరాం నుంచి జమ్ము వరకూ రహదారుల మరమ్మతులకు ఎమ్మెల్యే లోకం నాగమాధ వి మంగళవారం కుమిలి గ్రామంలో శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జలపారి శివ, మాజీ ఏఎంసీ చైర్మన్‌ దల్లి ముత్యాలరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 11:54 PM