Share News

పల్లెల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:24 AM

పల్లెల అభివృ ద్ధికి టీడీపీ కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

పల్లెల అభివృద్ధికి కృషి

  • మంత్రి శ్రీనివాస్‌

బొండపల్లి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృ ద్ధికి టీడీపీ కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గరుడుబిల్లి గ్రామంలో రూ.కోటి 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన శుక్రవారం ప్రారంభిం చారు. అనంతరం గొట్లాం క్లస్టర్‌ ఇన్‌చార్జి, కొరటాం మాజీ సర్పంచ్‌ నంబూరి రాజేష్‌ ఆధ్వర్యంలో గరుడబి ల్లి గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టి.. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థుల వినతిమేరకు శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తామని, అలాగే అంగన్‌వాడీ కేంద్రం మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు నిర్మాణం చేపడతామన్నారు. తొలుత బోడ సింగిపేట గ్రామంలో కోర్టు కాలనీలో ఉన్న బ్రహ్మకుమారీల ఓంశాంతి భవనంలో నిర్వ హించిన నషాముక్తి భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 20న బ్రహ్మకుమారిస్‌ చేపట్టనున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, బీజేపీ నేత రెడ్డి పావని, మర్రాపు సురేష్‌, పీవీవీ గోపాలరాజు, కోరాడ కృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు ఆర్‌.అచ్చంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 12:24 AM