Share News

AI ఏఐతో సమర్థంగా వైద్య సేవలు

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:30 PM

Efficient Healthcare Services with AI చిన్నారుల ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి.. సకాలంలో వారికి వైద్య సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికను సమర్థంగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో జీరో నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఏఐ ఆధారిత స్ర్కీనింగ్‌ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 AI  ఏఐతో సమర్థంగా వైద్య సేవలు
మాట్లాడుతున్న కలెక్టర్‌

  • చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించండి

పార్వతీపురం, జూన్‌2(ఆంధ్రజ్యోతి): చిన్నారుల ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి.. సకాలంలో వారికి వైద్య సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికను సమర్థంగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో జీరో నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఏఐ ఆధారిత స్ర్కీనింగ్‌ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పోషకాహార సమస్యలు, ఆరోగ్య సంబంధిత ఇబ్బందులను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుందని కలెక్టర్‌ తెలిపారు. యాప్‌ ఆధారిత స్ర్కీనింగ్‌ విధానం సులభ మన్నారు. సిబ్బంది దానిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, సిబ్బంది పనితీరును మెరుగుపరిచేందుకు ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించా లన్నారు. వెనుకబడిన కేంద్రాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. తన చాంబర్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య ఆరోగ్యశాఖాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. రోజూ ఉదయాన్నే హెల్త్‌ డైలీ రిపోర్టు, ఆశా ఫెర్మారెన్స్‌ వివరాలను తప్పనిసరిగా సమర్పిం చాలన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారిని ఆసుపత్రికి రెఫర్‌ చేసి ఆ సమాచారాన్ని వెంటనే కలెక్టరేట్‌కు అదించాలని సూచించారు. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం, అల వాట్లపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుత సీజనల్‌ వ్యాధులపై ప్రజలను చైతన్యపర్చాలని ఆదేశించారు. హోమియోపతి మందులను గ్రామాల్లో విరివిగా పంపిణీ చేయాలని తెలిపారు. ఎక్కడైనా మలేరియా కేసు నమోదైతే ఏఎన్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్లపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. గృహ సందర్శనల సమయంలో ప్రతి గర్భిణి, బాలింత వద్ద ఉన్న మాతా శిశు సంరక్షణ కార్డులను స్వయంగా తనిఖీ చేయాలన్నారు. బాలింతల ఇళ్లను ఆశాలు షెడ్యూల్‌ పకారం సందర్శించి తల్లి, నవజాత శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని సూచించారు. గర్భిణులు, నవజాత శిశువులు, ఐదేళ్లలోపు పిల్లలందరికీ షెడ్యూల్‌ ప్రకారం టీకాలు వేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 11:30 PM