సమాజాభివృద్ధిలో ఈఈఈ కీలకపాత్ర
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:51 PM
రోజువారీ జీవితంలో ఎలకా్ట్రనిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంద ని గురజాడ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు తెలిపారు. ఆధునిక సాంకేతిక అభివృద్ధి, పరిశ్రమలు, సమాజ అభి వృద్ధిలో ఈఈఈ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
విజయనగరం రూరల్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రోజువారీ జీవితంలో ఎలకా్ట్రనిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంద ని గురజాడ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు తెలిపారు. ఆధునిక సాంకేతిక అభివృద్ధి, పరిశ్రమలు, సమాజ అభి వృద్ధిలో ఈఈఈ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. బుధ వారం విజయనగరంలోని జవహర్‌లాల్ నెహ్రు సాంకేతిక గురజాడ వర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) విభాగం ఆధ్వర్యంలో ఈసీఎల్‌సీటీక్యూఈ-2కె26 జాతీయస్థాయి సాంకేతికసదస్సు ప్రారంభించారు. కార్యక్రమం లో జేఎన్‌టీయూ జీవీ రిజిస్టార్ ప్రొఫెసర్ జి.జయసుమ, ఎన్‌ఎండీసీ డీసీఎం శ్రీనివాస నాయుడు, ప్రిన్సిపాల్ కె.చంద్రభూషణరావు, వైస్‌ప్రిన్సిపాల్ నాగరాజు పాల్గొన్నారు.